‘కన్నప్ప’ ట్రైలర్ రన్ టైం లాక్.. అంచనాలు పెంచే రేంజ్ కట్ తో రెడీ

మంచు విష్ణు హీరోగా అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్ లాంటి బిగ్ స్టార్స్ కలయికలో దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమానే “కన్నప్ప”. హాలీవుడ్ లెవెల్ స్టాండర్డ్స్ తో తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఈ సాయంత్రం రాబోతోంది. ఇందుకు ఆల్రెడీ మేకర్స్ గ్రాండ్ ప్లానింగ్స్ కూడా చేసారు.

అయితే ఈ ట్రైలర్ రన్ టైం ఇప్పుడు లాక్ అయ్యినట్టు తెలుస్తోంది. మొత్తం 2 నిమిషాల 55 సెకండ్ల నిడివితో అంచనాలు పెంచే విధంగా ఉండబోతుందట. అలాగే ఈ ట్రైలర్ ని మోహన్ లాల్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ట్రైలర్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఈ సాయంత్రం 6 గంటల వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే మేకర్స్ పాన్ ఇండియా లెవెల్లో గట్టి ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.

Exit mobile version