‘కన్నప్ప’ను లీక్ చేయాలని కుట్ర జరుగుతుంది – విష్ణు అండ్ టీమ్

టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘కన్నప్ప’ చిత్రానికి సంబంధించి ఓ హార్డ్ డ్రైవ్ మిస్ కావడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫుటేజీ ఉన్న హార్డ్ డ్రైవ్ చోరీకి గురైందని మేకర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ డ్రైవ్‌లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలు ఉన్నట్లు వారు తెలిపారు.

అయితే, ఈ సినిమాను లీక్ చేసేందుకు సినీ ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు కుట్ర చేస్తున్నారని.. ఇది నిజంగా బాధాకరం అని.. చిత్ర యూనిట్ వాపోయింది. తమ కష్టాన్ని కాజేయాలని చూస్తున్నారు కొందరు అంటూ చిత్ర యూనిట్ తాజాగా తెలిపారు. ఇక ఈ సినిమాపై ఆ మహాదేవుని ఆశీస్సులు ఉన్నాయని.. ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, తమ సినిమా తప్పక విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.

ఈ సినిమాలో విష్ణుతో పాటు మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను జూన్ 27న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Exit mobile version