‘రణం’, ‘సామాన్యుడు’, ‘బెండు అప్పారావు ఆర్ఎంపి’, ‘కత్తి కాంతారావు’ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కామ్న జఠ్మలాని గుర్తుందా? చూడటానికి కాస్త పొట్టిగా ముద్దుగా ఉండే ఈ భామ కెరీర్లో హిట్స్ ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ అవకాశాలేమీ రాలేదు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ భామకి కింగ్ అక్కినేని నాగార్జున సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసింది.
నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భాయ్’. ఈ సినిమాలో రిచా గంగోపాధ్యాయ్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం కామ్న జఠ్మలానిని తీసుకున్నారు. ఈ పాత్రలో ఆమె పాతబస్తీ యువతిగా కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ కి వీరభద్రం చౌదరి డైరెక్టర్. యంగ్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉంటే కామ్న జఠ్మలాని నటించిన ‘యాక్షన్ 3డి’ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.