ఈ సబ్జెక్ట్ ని వారు మాత్రమే అర్ధం చేసుకోగలరు.!

ప్రతి సినిమాలోనూ ఎదో ఒక వైవిధ్యమైన పాత్రలు చేసి భారతదేశ ప్రేక్షకుల మెప్పును పొంది యూనివర్సల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు మన కమల్ హాసన్. ఈ రోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తనే హీరోగా, నిర్మాతగా మరియు దర్శకునిగా తెరకెక్కించిన ‘విశ్వరూపం’ సినిమా 3డి వెర్షన్ ట్రైలర్ ని లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ ముఖ్యంగా ఈ సినిమా చిన్న పిల్లలు చూడదగ్గ చిత్రం కాదు. కొంచెం మేధస్సు ఉన్న ప్రేక్షకులు మాత్రమే ఈ సినిమాలో నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ని అర్థం చేసుకోగలరు. టెర్రరిజంలోని ఒక కోణాన్ని తీసుకొని ఈ సినిమాని నిర్మించాము, అంతే కానీ ఈ సినిమాలో టెర్రరిజంకి మేము పరిష్కారం చెప్పడం లేదు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యు/ఏ సర్టిఫికేట్ ఇచ్చారని’ ఆయన తెలిపారు.

కమల్ తో పాటు శేఖర్ కపూర్, రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా జెరేమియా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయాలనుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని త్వరలోనే ప్రకటించనున్నారు.

Exit mobile version