ఎన్నో రకాల వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించిన యూనివర్సల్ స్టార్ గా కమల్ హాసన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయనకీ భారత ప్రభుత్వం తాజాగా ‘పద్మ భూషణ్’ అవార్డు ను ప్రకటించింది. దాంతో ఆయన తన ఆనదాన్ని పంచుకోవడం కోసం పత్రికా మిత్రులతో కాసేపు ముచ్చటించారు.
‘ఎంతో మంది ఈ పురష్కారానికి అర్హులైన వారున్నారు. ఇప్పటి వరకు నేను సాధించిన దానికి అలాగే ఇకపై నేను సాధించబోయే దానికి కలిపి ఈ అవార్డు ఇచ్చినట్లుగా భావిస్తున్నాను. ఎప్పటికైనా ప్రజలు నామీద చూపించే అభిమానమే నా ప్రధమ పురష్కారం. నాకు సినిమా గురించి ఎన్నో నేర్పన వారికి, నా కుటుంబ సభ్యులకు దీనిని అంకితమిస్తున్నానని’ కమల్ హాసన్ అన్నాడు.
మీరు రాజకీయాల్లోకి వస్తారా? అని అడిగితే ‘ ఇక్కడ అందరూ రాజకీయవేత్తలే. మనమందరం ఐదేళ్ళకి ఒకసారి ఓటు వేసి వేలిపై నచ్చ వేయించుకుంటాం. ఆ మచ్చ నాకు చాలని’ కమల్ హాసన్ సమాధానం ఇచ్చాడు. కమల్ హాసన్ ప్రస్తుతం విశ్వరూపం 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.