ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్ర రెండు రోజుల క్రితం మృతి చెందారు. ఆ వార్తతో తమిళ్ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి కి గురి అయింది. తమిళ్ లో ఎన్నో మంచి చిత్రలాకి దర్శకత్వం వహించిన బాలు మహేంద్ర ఎంతో మంది గొప్ప నటీనటులతో పని చేశారు. బాలు దర్శకత్వం వహించిన ఎన్నో చిత్రాల్లో కమల్ హాసన్ నటించారు. విరివురు ఎంతో పేరు పొందిన హిందీ చిత్రం ‘సద్మా’ లో కలసి పని చేసారు.
‘సద్మా’లో పని చేస్తున్నపటి రోజులు గుర్తు చేసుకుంటూ “బాలు తో నాకు చాలా మంచి సాన్నిహిత్యం వుంది. ఆయన నాలాంటి కొత్త వాళ్ళ ఐడియాస్ ని కూడా వినేవారు. ఆ చిత్రం క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నపుడు నన్ను ఎంతో ప్రోత్సహించారు, నేన పాత్ర ని ఎలా చేద్దాం అనుకున్నానో చెప్పినప్పుడు కూడా విన్నారు. ” అని తెలిపారు.