యూనివర్సల్ హీరో కమల్ హాసన్, వెటరెన్ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఈ మూవీపై సాలిడ్ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రంలో శింబు కూడా నటిస్తుండటంతో మల్టీస్టారర్ చిత్రంగా ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ చిత్రాన్ని పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా మణిరత్నం తనదైన క్లాస్ టచ్ ఇస్తూ తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఓ నాయకుడు, అతను పెంచుకునే వారసుడు.. ప్రత్యర్థులు ఆ పవర్‌ను లాక్కోవడానికి చేసే ప్రయత్నాలు.. కలగలసి ఈ సినిమా కథగా రాబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ పలు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తున్నాడు. గాడ్ ఫాదర్ తరహా పాత్రలో కమల్ తనదైన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు.
ఆయనకు తోడుగా శింబు కూడా సాలిడ్ పాత్రలో నటిస్తున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, మహేష్ మంజ్రేకర్, అలీ ఫజల్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, అభిరామి వంటి స్టార్ క్యాస్టింగ్ నటిస్తుండటంతో వారి పాత్రలు ఎలా ఉండబోతున్నాయా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా తెలుగు లో శ్రేష్ఠ్ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 5న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.