కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం’ సినిమా థియేటర్స్ విషయంలో తనని ఇబ్బంది పెడుతున్న వారిపై ఈ రోజు చెన్నైలో కంప్లైంట్ ఇచ్చారు. గత నెలరోజుల ముందు నుంచే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకుంది. ఎప్పుడైతే కమల్ ఈ సినిమాని డి.టి హెచ్ లో రిలీజ్ చేస్తున్నాను అన్నారో అప్పటి నుంచి థియేటర్ ఓనర్స్ నుంచి ఎదురు దాడి మొదలైంది. అలాగే కమల్ కి కొంతమంది నుంచి సినిమాని పైరేట్ చేస్తామని, సినిమా వేసే టైములో కరెంట్ కట్ చేస్తామని బెదిరింపు కాల్స్ కూడా రావడంతో కమల్ చెన్నై అసిస్టెంట్ డి.జి.పిని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. అలాగే గవర్నమెంట్ అఫిషియల్స్ ని కలిసి ఈ విషయం గురించి మంతనాలు జరిపారు.
ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో జనవరి 11న రిలీజ్ కానుంది. దాసరి నారాయణరావు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. హీరో, నిర్మాత, డైరెక్టర్ అన్నీ కమల్ హాసన్ అయిన ఈ సినిమాలో పూజా కుమార్, ఆండ్రియా జెరేమియా, రాహుల్ బోస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు.