మరో నూతన టెక్నాలజీని భారతీయ సినిమాకి పరిచయం చెయ్యనున్న కమల్

మరో నూతన టెక్నాలజీని భారతీయ సినిమాకి పరిచయం చెయ్యనున్న కమల్

Published on Sep 18, 2012 3:38 PM IST


కమల్ హాసన్ ఎప్పటికప్పుడు భారతీయ సినిమాకు అంతర్జాతీయ ప్రమాణాలను అందిస్తూ వస్తున్నారు. కథ చెప్పే విషయంలో అయినా టెక్నాలజీ విషయం లో అయినా ఆయనది ప్రత్యేక శైలి. త్వరలో అయన మరో నూతన టెక్నాలజీని పరిచయం చెయ్యనున్నారు.ఆరో 3డి సౌండ్ సిస్టం గా పిలవబడే ఈ టెక్నాలజీ సినిమా అభిమానులను విశేషంగా ఆకట్టుకోనుంది. ఇప్పటి వరకు ఇక్కడ డాల్బి 5.1 లేదా 7.1 సౌండ్ సిస్టంని కాని వాడుతున్నారు. ఈ ఆరో అనే టెక్నాలజీ లో సౌండ్ సిస్టం 11.1గా ఉంటుంది. ఈ టెక్నాలజీకి కమల్ హాసన్ “విశ్వరూపం” చిత్రం నాంది పలకనుంది.

ఈ ఆరో 3డి టెక్నాలజీ లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది థియేటర్లో స్పీకర్లు అమర్చిన విధానం గమనించాలి ఈ టెక్నాలజీ కోసం కొత్త రకమయిన విధానంలో స్పీకర్లను అమరుస్తారు ఇది ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇప్పటి వరకు ఈ టెక్నాలజీని జార్జ్ లూకాస్ “రెడ్ టైల్స్” చిత్రం కోసం మాత్రమే ఉపయోగించారు. కమల్ హాసన్ “విశ్వరూపం చిత్రం రెండవ చిత్రంగా ఉండబోతుంది. ఈ విషయం భారతీయ చిత్రానికి గర్వకారణం.

బార్కోలో కొంతమంది నిపుణులు ఈ ఆరో 3డి సిస్టంని సృష్టించిన వారు చెన్నై వచ్చి ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఆరో 3డి ఫార్మటు లోకి మార్చే పని నిమగ్నమయ్యారు. ఈ చిత్రంలో ఈ కొత్త అనుభూతి ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఇప్పటికే ఈ చిత్రం మేదేహ ఉన్న అంచనాలను రెట్టింపు చేయ్యనుంది.

తాజా వార్తలు