ఈ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో కూడా వచ్చేసిన కళ్యాణ్ రామ్ రీసెంట్ సినిమా!

ఈ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో కూడా వచ్చేసిన కళ్యాణ్ రామ్ రీసెంట్ సినిమా!

Published on May 23, 2025 12:02 AM IST

నందమూరి వారి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా పవర్ఫుల్ సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో దర్శకుడు ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ కం ఎమోషనల్ చిత్రమే అర్జున్ సన్నాఫ్ వైజయంతి. అయితే ఈ చిత్రం థియేటర్స్ లో రిలీజ్ తర్వాత ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొన్ని రోజులు కితమే స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఇక ఈ ఓటిటి కాకుండా మరో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లో కూడా నేటి నుంచి ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు నేటి నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే ఇందులో కూడా వీక్షించవచ్చు. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు