లక్ కోసం కడప దర్గాను దర్శించుకున్న కళ్యాణ్ రామ్

లక్ కోసం కడప దర్గాను దర్శించుకున్న కళ్యాణ్ రామ్

Published on Jul 15, 2013 11:55 AM IST

kalyan-ram-stills
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘ఓం’ సినిమా ఈ శుక్రవారం విడుదలకానుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని కళ్యాణ్ రామ్ భారీ ఖర్చుతో నిర్మించాడు. తను ఈ సినిమాతో తన లక్ మారాలని కడపలోని పెద్ద దర్గాని దర్శించుకున్నాడు. ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడుతూ ‘ బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందన్న నమ్మకం నాకుంది’ అని అన్నాడు. భారీ బడ్జెట్ తో ‘ఓం’ సినిమాని 3డి లో నిర్మిచిడం జరిగింది. ఈ సినిమా ఇండియాలోని ఫస్ట్ యాక్షన్ 3డి సినిమాగా నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో కృతి ఖర్బంధ, నికిష పటేల్ హీరోయిన్స్ గా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు