నందమూరి వారసుడిగా అరంగేట్రం చేసి ఒక్క హీరోగానే కాకుండా ఎన్ టి ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పెట్టి నిర్మాతగా కూడా సినిమాలు తీస్తున్న హీరో కళ్యాణ్ రామ్. ప్రస్తుతం తన సొంత బ్యానర్లో ‘ఓం’ అనే ఒక 3డి సినిమాని తెరకెక్కిస్తున్నారు. భారీ వ్యయంతో, హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో నిర్మిస్తున్న ఈ సినిమా విశేషాల గురించి చెబుతూ ‘ యాక్షన్ ప్రధానమైన ఈ సినిమాలో కామెడీ, మంచి సాంగ్స్ కూడా ఉంటాయి. ఈ సినిమాని 3డిలో నిర్మిస్తున్నాం. కానీ యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్న సినిమాని 3డి లో తెరకెక్కించడం అనేది కట్టి మీద సాము లాంటిది. సినిమా సెట్స్ మీదకి వెళ్లకముందు సుమారు 8 నెలలు ప్రీ ప్రొడక్షన్ పనులు చేసాము. ఆ తర్వాత 150 రోజులు షూట్ చేసాము. ఈ నెలాఖరులోగా ఆడియోని విడుదల చేసి సమ్మర్ కానుకగా సినిమాని రిలీజ్ చేస్తామని’ కళ్యాణ్ రామ్ అన్నాడు.
కృతి కర్భంద, నికీషా పటేల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ఛాయాగ్రాహకుడు సమీర్ రెడ్డి డైరెక్టర్ గా మారుతున్నాడు. అచ్చు, సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.