రంగ రంగ వైభవంగా కళామందిర్ 17వ వార్షికోత్సవ వేడుక

రంగ రంగ వైభవంగా కళామందిర్ 17వ వార్షికోత్సవ వేడుక

Published on Jul 8, 2025 7:30 AM IST

కళామందిర్ ఫౌండేషన్ 17వ వార్షికోత్సవాలను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హైదరాబాదులో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుక రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు, వ్యాపార నిపుణులు, సామాజిక సేవకర్తలు, కళామందిర్ ఫౌండేషన్ నిర్వాకులతో కన్నుల పండుగగా జరిగింది.

ఈ వేడుకలో సినీ నటుడు కమెడియన్ అలీ మాట్లాడుతూ.. ‘మనం ఎంతకాలం బతికామని కాదు, ఎంత సేవ చేసాము అనేదే ముఖ్యం. అలాగే కళామందిర్ బ్రదర్స్ కూడా ఎన్ని బ్రాంచీలు పెట్టామని కాదు, ఎంతమందికి సేవ చేసాము అనేదే వారికి ముఖ్యమన్నారు. ప్రతి సంవత్సరం కళామందిర్ వార్షికోత్సవ వేడుకను ఎంతో బ్రహ్మాండంగా చేస్తూ.. ఎంతోమంది దివ్యాంగులకు సేవ చేస్తారు. ఆర్థిక సాయం చేస్తారు అందుకేనేమో కళామందిర్ ఇలా వెలిగిపోతుంది.’ అని అన్నారు.

ప్రముఖ రచయిత బివిఎస్ రవి మాట్లాడుతూ.. ముందుగా కళామందిర్ ఫౌండర్ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ. దినదిన ప్రవర్తమానంగా స్టాక్ మార్కెట్లో కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు అని అన్నారు. ఇక కళామందిర్ ఇలా దేదీప్యమానంగా వెలగడానికి మహిళలే కారణమని.. అందులో భాగంగా ప్రసాద్ గారి వెన్నంటి ఉండే తమ కుటుంబంలోని ఆరు మంది మహిళలతో పాటు కళామందిర్ కుటుంబంలో ఉన్న మహిళలు కూడా కారణమని అన్నారు.

సినీ నటుడు మంచు మనోజ్ మాట్లాడుతూ.. కళామందిర్ వేడుక చాలా బ్రహ్మాండంగా, కన్నుల పండుగగా ఉందని అన్నారు. అలాగే ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణ్ గారు వేడుక గురించి చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది కచ్చితంగా ఈ వేడుకలో భాగస్వామ్యం కావాలని అనుకున్నట్లు తెలిపారు. కళామందిర్ బిజినెస్ పరంగా ఎదగడమే కాదు ఎంతోమందికి సేవ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక బ్రాంచ్ తో మొదలైన కళామందిర్ ప్రయాణం నేడు దేశవ్యాప్తంగా 60 బ్రాంచ్ లకు చేరడం అంటే అది కళ్యాణ్, ప్రసాద్ గార్ల కృషి పట్టుదల అన్నారు.

డైరెక్టర్ బాబి కొల్లి మాట్లాడుతూ.. ఇలాంటి బర్త్ డేలు ప్రసాద్ గారు వంద సంవత్సరాలు జరుపుకోవాలని, ఖచ్చితంగా జరుపుకుంటారు అన్నారు. ప్రసాద్ గారు కావాలంటే ఏ దుబాయిలోనో కోట్లు ఖర్చుపెట్టి జన్మదిన వేడుకలు చేసుకోవచ్చు కానీ, గత 17 సంవత్సరాలుగా కళామందిర్ కుటుంబ సభ్యులతో.. ఎంతోమంది దివ్యాంగులకు సేవలందిస్తూనే తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.. అది ఆయన గొప్పతనం అన్నారు. కచ్చితంగా ప్రసాద్ గారు చేసే సేవా కార్యక్రమాలు అన్ని ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అన్నారు.

సినీ నటుడు శ్రీ విష్ణు మాట్లాడుతూ.. చాలామంది డబ్బు సంపాదిస్తారు, చదువుకుంటారు గొప్ప గొప్ప ప్రదేశాలకు వెళ్తారు.. కానీ ఇలా సేవ చేయాలని చాలా తక్కువ మందికి అనిపిస్తుంది. అందుకు ప్రసాద్ గారు హృదయం చాలా గొప్పది అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు