తెలుగులో రాబోతున్న కలకలప్పు ?


సుందర్ సి డైరెక్షన్లో తమిళ్లో వచ్చిన తాజా చిత్రం ‘కలకలప్పు’ ఇటీవలే విడుదలై తమిళనాడులో కలెక్షన్లు బాగా వసూలు చేస్తుంది. విమల్, శివ, అంజలి ఓవియ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ కామెడీ చిత్రాన్ని కుష్బూ నిర్మించగా యుటివి మోషన్ పిక్చర్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేసారు. తమిళ్లో మంచి కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేయాలనీ భావిస్తున్నారు. యుటివి సౌత్ హెడ్ అయిన ధనంజయన్ గోవింద్ మాట్లాడుతూ తమిళ్లో ఈ సినిమా విజయం సాధించడంతో మిగతా భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనీ భావించాం అని తెలిపారు.

Exit mobile version