పోలీస్ ఆఫీసర్ గా కనిపించాలనుకుంటున్న కాజల్.!

పోలీస్ ఆఫీసర్ గా కనిపించాలనుకుంటున్న కాజల్.!

Published on Apr 9, 2013 9:54 PM IST

Kajal-Agarwal

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అందాల భామ కాజల్ అగర్వాల్ ఈ సంవత్సరం ‘నాయక్’, ‘బాద్షా’ సినిమాలతో వరుసగా తెలుగులో రెండో హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.తెలుగులో వరుసగా రెండో హిట్ అందుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. ఎవరన్నా హీరోయిన్ ని మీ డ్రీం రోల్స్ ఏంటి అని అడిగితే ఎక్కువ భాగం మంది మంచి నటిగా గురిపు తెచ్చుకోవాలి అని చెబుతుంటారు కానీ కాజల్ మాత్రం తన డ్రీం రోల్స్ గురించి ఒక పెద్ద లిస్టే చెప్పింది.

కాజల్ మీ డ్రీం రోల్స్ ఏంటి అని అడిగితే ‘ నా వరకూ డ్రీం రోల్స్ ఎక్కువగానే ఉన్నాయి. అందులో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, పవర్ఫుల్ పోలీస్ పాత్ర, యాక్షన్ చేయగలిగిన పాత్రలు, అవుట్ అండ్ అవుట్ కామెడీ పాత్రలు చేయాలని ఉంది. కరెక్ట్ స్టొరీ దొరికితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని ఉంది. ఇప్పటికే అలాంటి అవకాశాలు వచ్చినా అప్పట్లో టైం లేక చెయ్యలేదని’ కాజల్ చెప్పింది. కాజల్ ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలు చేస్తోంది. తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమాలో అతిధి పాత్రలో కనిపించనుంది. ఫ్యూచర్ లో కాజల్ తను చేయాలనుకుంటున్న డ్రీం రోల్స్ చేసి ప్రేక్షకులని ఆకట్టుకోవాలని ఆశిద్దాం..

తాజా వార్తలు