యుబీఎం తో కలిసి సమాజ సేవలో పాల్గొంటున్న కాజల్

యుబీఎం తో కలిసి సమాజ సేవలో పాల్గొంటున్న కాజల్

Published on Apr 8, 2013 6:45 PM IST

Kajal
కాజల్ అగర్వాల్ సినిమాలలో నటిస్తూ బీజీగా వుంది. కానీ తను సమాజ సేవ కోసం కూడా కొంత సమయాన్ని కేటాయిస్తోంది. ఇతర సెలబ్రటిస్లు ఎలాగైతే సమాజం కోసం హెల్ప్ చేస్తున్నారో తను కూడా అలాగే చేస్తోంది. కాజల్ అగర్వాల్ స్వచ్చంద సంస్థలకు సహాయం చేయడం కోసం మల్టీ నేషనల్ కంపెనీ యుబీఎం ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొంటోంది. ‘ ప్రపంచంలోని వున్న చాలా స్వచ్చంద సంస్థలకు నా వంతు సహాయం నేను చేస్తున్నాను. ఇది నా వ్యక్తిగత విషయం. కాబట్టి ఈ విషయం గురించి నేను మాట్లాడను. కార్పోరేట్ కంపెనీలకి, స్వచ్చంద సంస్థలకు మద్య వారదిగా యుబీఎంతో కలిసి నేను ఇప్పుడే పనిని ప్రారంబించాను. దీనికి యుబీఎం ప్లాట్ ఫాం గా కార్పోరేట్ కంపెనీలు ఫండ్స్ ని అందిస్తున్నాయి. ఒక్క భారత దేశంలోనే కాకుండా ప్రపంచమంతా వున్నా స్వచ్చంద సంస్థలన్నింటికి ఈ సహాయం అందుతుందని ‘ కాజల్ ట్వీట్ చేసింది.

కాజల్ నటించిన బాద్షా సినిమా ఈ మధ్యే విడుదలై మంచి హిట్ ని సాదించింది. ఈ సినిమాలో తను థ్రిల్లింగ్, కామెడీగా కనిపించే పాత్రలో నటించింది. ‘ నేను నా కెరీర్ లో చేసిన మొదటి కామెడీ రోల్ ఇది. ఎన్.టి.ఆర్, శ్రీను వైట్ల, ఎం.ఎస్. నారాయణ, బ్రహ్మానందంతో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందంగా వుంది. నేను వారితో కలిసి మరి కొన్ని సినిమాలు నటిస్తాననే నమ్మకం నాకుంది’ అని సినిమా సక్సెస్ మీటింగ్ లో అంది. ప్రస్తుతం తను హైదరాబాద్ లోనే వుంది. రామ్ చరణ్ హీరోగా వస్తున్న ‘ఎవడు’ సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమా తరువాత తను ఇంకా రెండు సినిమాలో నటిస్తోంది. ‘అల్ ఇన్ అల్ అజహాగు రాజ’ , ‘జిల్లా’ సినిమాలలో కార్తి, విజయ్ లతో నటించనుంది.

తాజా వార్తలు