దక్షిణాది స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కూడ కాజల్ వివాహం గురించి అనేక రూమర్లు రాగా ఈసారి మాత్రం వాటికి భిన్నంగా బలమైన వార్తలే వినిపిస్తున్నాయి. కాజల్ వివాహం చేసుకోబోయేది ముంబైకి చెందిన ఇంటీరియర్ డిజైనర్, వ్యాపారవేత్తనట. అతని పేరే గౌతమ్ కిచ్లు.
ఇప్పటికే వీరి నిశ్చితార్థం రహస్యంగా జరిగిపోయిందని లాక్ డౌన్ తర్వాత పెళ్లి ఖాయమని అంటున్నారు. ముంబైలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో రెండు రోజుల పాటు ఈ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతాయట. గౌతమ్ కిచ్లు గతంలో ఫ్యాబ్ ఫర్నిష్, ఎలిఫెంట్ కంపెనీల్లో వైస్ ప్రెసిడెంట్, సీవోగా బాధ్యతలు నిర్వహించాడట. అయితే ఈ వార్తల విషయమై కాజల్ నుండి ఇంకా ఎలాంటి స్పందన rఆకపోవడం గమనార్హం. మరోవైపు ఈ పెళ్లి వార్తలతో కాజల్ అభిమానులు ఎగ్జైట్ అయిపోతున్నారు. ఇకపోతే కాజల్ ప్రస్తుతం ‘మోసగాళ్లు, ఆచార్య, ఇండియన్ 2’ లాంటి సినిమాల్లో నటిస్తోంది.