కాజల్ అగర్వాల్ మూడవ హిందీ సినిమాలో నటించడానికి సంతకం చేసినట్టు తెలియజేశారు. గత సంవత్సరం తను అక్షయ్ కుమార్ తో కలిసి ‘స్పెషల్ చబ్బిస్’ సినిమాలో నటించింది. ఈ సినిమా 2013లో విమర్శకుల నుండి కూడా ప్రశంసలు అందుకుంది. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కాజల్ తను మరొక హిందీ సినిమాకి సంతకం చేసినట్టు తెలియజేశారు. అయితే ఆ సినిమా వివరాలను తెలియజేయడానికి ఆమె నిరాకరించారు. ఆమె నటించిన తమిళ సినిమా ‘జిల్లా’ ఈ మధ్య విడుదలై బాక్స్ ఆఫీసు వద్ద మంచి కలెక్షన్లను వసూలు చేస్తోంది. ‘విజయ్ , మోహన్ లాల్ తో కలిసి ‘జిల్లా’లో నటించడం చాలా ఆనందంగా ఉంది. మేము మంచి సినిమాని నిర్మించాము. మేము పడిన కష్టానికి ప్రజల నుండి మంచి స్పందన లబించింది. వారు మా కష్టాన్ని అర్థం చేసుకున్నారు’ అని అంది. హిందీ సినిమాతో పాటు కాజల్ కృష్ణ వంశీ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ తో కలిసి నటించనుంది. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి నుండి నిర్వహించే అవకాశం వుంది. అలాగే బాలాజీ మోహన్ సినిమాలో ధనుష్ తో కూడా కాజల్ నటించనుంది.