ఐ ట్యూన్స్ లో మొదటి స్థానంలో కడల్ ఆడియో

ఐ ట్యూన్స్ లో మొదటి స్థానంలో కడల్ ఆడియో

Published on Dec 15, 2012 2:19 PM IST

kadali
మణిరత్నం దర్శకత్వంలో రానున్న “కడల్” చిత్రం ప్రస్తుతం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. ఈ చిత్ర ఆడియో డిసెంబర్ 17న విడుదల అవ్వాల్సి ఉండగా రెండు రోజుల ముందే విడుదల చేశారు నిన్న ఈ చిత్ర పాటలను ఆపిల్ ఐ ట్యూన్స్ లో అప్లోడ్ చేశారు విడుదల అయిన కొద్ది నిమిషాలలోనే ఐ ట్యూన్స్ లో మొదటి స్థానానికి ఎగబాకింది. భారత దేశం మొత్తంలో ఈ చిత్ర పాటలు ఐ ట్యూన్స్ లో మొదటి స్థానంలో నిలవడం చిత్ర బృందానికి ఆశ్చర్యం కలిగించింది. ఈ చిత్ర తెలుగు ఆడియో కూడా మెల్లగా అంచనాలను పెంచుతుంది. ఈ మధ్యనే “నేంజికుల్లె” పాట తెలుగు వెర్షన్ “గుంజుకున్న” పాటను తెలుగులో విడుదల చేశారు. వనమాలీ ఈ పాటకు సాహిత్యం అందించారు. “కడలి” అనే పేరుతో తెలుగులోకి ఈ చిత్రం రానుంది. గౌతం మరియు తులసి ఈ చిత్రంతో తెరకు పరిచయం కానున్నారు. అరవింద్ స్వామి మరియు లక్ష్మి మంచు ఈ చిత్రంలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం జాలర్ల నేపధ్యంలో జరుగుతుంది. మణిరత్నం అభిమానులకి ఈ చిత్రం కన్నుల పండుగ కానుంది. 2013 జనవరిలో ఈ చిత్రం విడుదల కానుంది.

తాజా వార్తలు