‘పర్సన్ అఫ్ ద ఇయర్ 2013’ గా ఎన్నికైన కె. విశ్వనాథ్

‘పర్సన్ అఫ్ ద ఇయర్ 2013’ గా ఎన్నికైన కె. విశ్వనాథ్

Published on Apr 11, 2013 1:38 PM IST

K-Vishwanath
విలక్షన తెలుగు డైరెక్టర్, కళా తపస్వీ కె.విశ్వనాథ్ గారు ‘లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్’ నిర్వహించిన సర్వేలో ఈయన 20 మందిలో ‘పర్సన్ అఫ్ ద ఇయర్ 2013’ గా ఎన్నికయ్యారు. పోటిపడిన 20 మందిలో మణిరత్నం, కమల్ హసన్, సంతోష్ శివన్, ప్రభుదేవా, శ్రీకర్ ప్రసాద్,, నసీరుద్దీన్ షాన్, అలాగే టబు, విద్య బాలన్, షబానా అజ్మి, కాజోల్, రన్బీర్ కపూర్ లు వున్నారు. వంద సంవత్సరాల భారతదేశ సినీ చరిత్రలో ఇది చాలా సంతోషించాల్సిన విషయం. మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కె.విశ్వనాథ్ గారు ఒక ముఖ్యమైన వ్యక్తీ.

కొన్ని సంవత్సరాలుగా కె.విశ్వనాథ్ గారు తెలుగు, తమిళ సినిమాలలో కొన్ని ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈయన సినిమాలు శంకరభరణం, స్వాతిముత్యం, సాగర సంగమం, ఆపత్బంధవుడు మొదలగు సినిమాలు అద్బుతమైన సినిమాలుగా నిలిచాయి. ఆయనకు లబించిన ఈ గౌరవం ఒక్క కె.విశ్వనాథ్ గారికే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఆనందంగా వుందని సిని ప్రముఖులు అన్నారు.

తాజా వార్తలు