‘మాస్ జాతర’లో రమణ గోగుల తోనే ఆ సర్ప్రైజ్?

‘మాస్ జాతర’లో రమణ గోగుల తోనే ఆ సర్ప్రైజ్?

Published on Oct 30, 2025 12:03 PM IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన అవైటెడ్ మాస్ చిత్రమే “మాస్ జాతర”. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రేపు గ్రాండ్ ప్రీమియర్స్ తో షోస్ మొదలు పెట్టుకోనుంది. అయితే థియేటర్స్ లో ఓ క్రేజీ సర్ప్రైజ్ ఉందని మేకర్స్ ఇది వరకే తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడు హింట్ బయటకి వచ్చింది.

దీని ప్రకారం ప్రముఖ సంగీత దర్శకుడు అలాగే గాయకుడు రమణ గోగుల తోనే ఆ సర్ప్రైజ్ ఉంటుంది అని వినిపిస్తోంది. ఆల్రెడీ భీమ్స్ సంక్రాంతికి వస్తున్నాం తో చాలా కాలం తరువాత వింటేజ్ ట్రీట్ ని అందించాడు. ఇక మాస్ జాతరలో కూడా సర్ప్రైజ్ గా దీనిని దాచినట్టు తెలుస్తోంది. పైగా లేటెస్ట్ ఓ పిక్ కూడా వైరల్ గా మారింది. మరి ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది తెలియాలి అంటే రేపు సాయంత్రం వరకు ఆగాల్సిందే.

తాజా వార్తలు