ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో

Published on Aug 25, 2025 9:00 AM IST

Prema Ekkada Nee Chirunama

విడుదల తేదీ : ఆగస్టు 24, 2025

స్ట్రీమింగ్‌ వేదిక : ఈటీవీ విన్

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : రాంకీ, సాయి తేజ గోన, ఇవానా, మధు తదితరులు
దర్శకుడు : సుధీర్ కుమార్
నిర్మాత : రాఘవేంద్రరావు బి ఏ
సంగీతం : శాండీ అద్దంకి
సినిమాటోగ్రఫీ : కే ఎస్ ప్రకాష్ రెడ్డి
ఎడిటింగ్ : రాఘవేంద్ర వర్మ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

కథ:

పూజా (ఇవానా) అనే అమ్మాయి తన లైఫ్ లో ఒక పెద్ద ఇన్ఫ్లూయెన్సర్ కావాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకి పరిచయం అయ్యిన ఇద్దరు యువకులు (రాంకీ, సాయి తేజ) లతో ప్రేమాయణం కూడా ఒకరి బ్రేకప్ తర్వాత మరొకరికి చెబుతుంది. అయితే ఈ ప్రేమ కథలు ఎలా సాగాయి? ఆమె అనుకున్న గోల్ రీచ్ అయ్యిందా లేదా? మధ్యలో గౌతమ్ అనే వ్యక్తి ఎవరు? చివరికి ఆమె ఎవరికి సొంతం అయ్యింది అనేది ఎపిసోడ్ లో సారాంశం.

ప్లస్ పాయింట్స్:

ఈ ఎపిసోడ్ లో మొదటి పది నిమిషాల వరకు మాత్రం డీసెంట్ గా సాగుతుంది అని చెప్పాలి. మొదటి లవ్ స్టోరీ ట్రాక్ డీసెంట్ గా మంచి క్లారిటీతో కొనసాగుతుంది. అలాగే ఈ ట్రాక్ లో లీడ్ నటీనటులు ఇవానా, సాయి తేజ నడుమ మాటలు బాగున్నాయి. అలాగే సాయి తేజ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో మెచ్యూర్ యువకుడిగా కనిపించాడు.

ఇక మరో ట్రాక్ లో రాంకీ బాగా చేసాడు. ట్రెండీగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ఇద్దరితోని నటి ఇవానా బాగా కనిపించింది. కొన్ని మూమెంట్స్ లో ఆమె నటన, గ్లామర్ బాగున్నాయి. అలాగే సోషల్ మీడియా కంటెంట్ వరకు ఆమెపై డిజైన్ చేసుకున్న సీన్స్ పర్వాలేదు.

మైనస్ పాయింట్స్:

కొంతమేరకు ఈ లఘు చిత్రంలో కాన్సెప్ట్ ఓకే అనిపిస్తుంది కానీ ఆ తర్వాత మాత్రం పూర్తిగా ఇంప్రెషన్ మారిపోతుంది. ముఖ్యంగా అమ్మాయి పాత్ర ‘బేబి’ షేడ్ లో కనిపిస్తుంది. ఆమె అమాయకత్వాన్ని ప్రస్తుత సమాజంలో ఈ తరహా ఆడపిల్లలు ఎలా ఉన్నారు వారి ఆలోచనా ధోరణి లాంటివి చాలా రొటీన్ గా అనిపిస్తాయి.

ఇక ఇవి అయినా కొంతమేర ఓకే కానీ చివరికి వచ్చే సరికి ఆమె పాత్రకి జ్ఞానోదయం మళ్ళీ దేశభక్తి లాంటి అంశాలు ఇరికించడం వంటివి మాత్రం డిజప్పాయింటింగ్ గా అనిపిస్తాయి. ఎమోషన్ సరిగా పండలేదు.

ఇంకా చికాకు తెప్పించే అంశం ఏంటంటే ఆమెకి పెళ్లి సెట్ అయ్యిన 6 నెలల వ్యవధిలోనే రెండు లవ్ ట్రాక్ లు నడిపించడం మళ్ళీ వేరొకరిని పెళ్లి చేసుకోవడం అనేది అందరికీ రుచించకపోవచ్చు. సో ఇలాంటివి మాత్రం ఈ ఎపిసోడ్ ని బాగా డ్రాగ్ చేసాయి.

సాంకేతిక వర్గం:

ఈ లఘు చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు కానీ ప్రొడక్షన్ డిజైన్ మాత్రం ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఆర్మీ నేపథ్య సీన్స్ లో వీక్ క్వాలిటీ కనిపిస్తుంది. సంగీతం బాగుంది. కెమెరా వర్క్ కూడా డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ లో దాదాపు కన్విన్సింగ్ గా ట్రై చేసారు.

ఇక దర్శకుడు సుధీర్ కుమార్, రాఘవేంద్ర రావు గారు ఇచ్చిన కథకి చేసిన పనితీరు బాగానే ఉంది కానీ కథ లోనే లోపం ఉండడంతో తాను సేవ్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది. రాఘవేంద్ర రావు గారు మంచి ఆరంభం ఇచ్చారు కానీ ముగింపు మాత్రం మరోలా ఉంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ అనే లఘు చిత్రం పెద్దగా ఆకట్టుకోదు. మొదటి 10 నిమిషాల వరకు ఓకే కానీ మిగతా అంశాలు మాత్రం చాలా డిజప్పాయింటింగ్ గా అనిపిస్తాయి. లవ్ ట్రాక్స్ వరకు ఓకే కానీ ఫోర్స్డ్ గా అనిపించే దేశ భక్తి అంశాలు వీక్ కథనం ఈ ఎపిసోడ్ ని డల్ గా మార్చేశాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు