ఏప్రిల్లో రెండవ వారంలో ‘జులాయి’ ఫస్ట్ లుక్


అల్లు అర్జున్, ఇలియానా జంటగా నటిస్తున్న జులాయి చిత్ర ఫస్ట్ లుక్ ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ పోలిస్ ఆఫీసర్ గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. బ్రహ్మానందం ఈ సినిమాలో కడుపుబ్బా నవ్వించనున్నాడని సమాచారం.

అతడు తరువాత త్రివిక్రమ్ డైరెక్షన్లో సోనూసూద్ మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్నాడు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య సమర్పిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

Exit mobile version