‘ఎఫ్ 2’ సీక్వెల్ లో అందరూ అనుకున్నట్లు మూడో హీరో ఉండరని ఇప్పటికి అనిల్ రావిపూడి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు. దాంతో, అసలు ‘ఎఫ్ 3’కి ఎలాంటి కథ ఉంటుందనే అంశం పై ఇప్పుడు కొత్తగా రూమర్స్ ప్రారంభమయ్యాయి. తాజా గాసిప్ ఏమిటంటే, ‘ఎఫ్ 2’లో ఉన్న నటీనటులతో పాటు వారి పాత్రలు కూడా ‘ఎఫ్ 3’లో సేమ్ అలాగే ఉంటాయట. వెంకీ – వరుణ్ తేజ్ జీవితాలలో తరువాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సీక్వెల్ నడుస్తోందని తెలుస్తోంది. అంటే వారి భార్యలతో వచ్చే మరెన్నో సమస్యల సమ్మేళనమే ‘ఎఫ్ 3’ అని లేటెస్ట్ సమాచారం.
ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ సినిమా స్క్రిప్ట్ తయారుచేసే పనిలో ఉన్నాడు. మరో రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు కూడా పూర్తవుతాయట. ఈ చిత్రాన్ని నవంబర్ నెల నుండి మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం వెంకి ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు, వరుణ్ తేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఒక చిత్రం చేస్తున్నారు. కరోనా కారణంగా ఆయా సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి.
అయితే ఈ రెండు సినిమాలు అక్టోబర్ సమయానికి పూర్తవుతాయట. అందుకే అదే సమయానికి ‘ఎఫ్ 3’ని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.