మెగస్టార్ చిరంజీవి, కొరటాల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో హీరో మహేశ్ బాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. అయితే సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా మంచి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న మహేశ్ చిరు సినిమాలో నటిస్తున్నాడు అన్న వార్త వినగానే ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ అయిపోతున్నారు.
ఈ చిత్రంలో మహేశ్ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ పాత్రలో మహేశ్ కొత్త లుక్లో కనిపించనున్నారని అందుకోసం ఆయన శరీరాకృతిని కూడా మార్చుకుంటున్నాడని సమాచారం. ఈ సినిమాలో మహేశ్ పాత్ర సీరియస్గా ఉండనుందని, ఓ ముఖ్యమైన సందర్భంలో రానుండడంతో మహేశ్ పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందన్న వారతలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా మహేశ్ పాత్ర ఈ సినిమాకు మంచి ప్లస్ అవ్వడం గ్యారంటీగా కనిపిస్తుంది.