బాలీవుడ్ నటి డ్రగ్స్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నా రియా చక్రవర్తికి ముంబై స్పెషల్ కోర్ట్ మరొకసారి షాకిచ్చింది. ఆమె కస్టడీని ఇంకో 14 రోజులు అనగా అక్టోబర్ 20 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రియాకు రిమాండ్ పొగిడించడం ఇది రెండవసారి. ఆరెస్ట్ కాబడిన మొదటిసారి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు ఆ తర్వాత గత నెల 22న అక్టోబర్ 6 వరకు రిమాండ్ పొడిగించి మళ్లీ ఈరోజు ఇంకో 14 రోజులు రిమాండ్ విధించింది. ఆమెతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి కూడ రిమాండ్ పొడిగించారు.
సుశాంత్ సింగ్ మరణం కేసులో మొదలైన దర్యాప్తు మెల్లగా బాలీవుడ్ పరిశ్రమలోని డ్రగ్స్ కోణాన్ని బయటకు తెచ్చింది. డ్రగ్స్ సరఫరా అనుమానాలతో రియాను మూడు రోజులు విచారించి గత నెల 9న అరెస్ట్ చేశారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. ఆమెతో పాటే ఆమె సోదరుడుతో కలిపి మొత్తం 19మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, దీపికా పదుకొనేలను సైతం ఎన్సీబీ అధికారులు విచారణ చేశారు. ఇదిలా ఉంటే మొదట్లో ఈ డ్రగ్ రాకెట్ విషయంలో మౌనంగా వ్యవహరించిన బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు ఇప్పుడు రియా చక్రవర్తిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.