జూనియర్ ఎన్టీయార్ ఆఫీస్ పై దాడి

జూనియర్ ఎన్టీయార్ ఆఫీస్ పై దాడి

Published on Jul 12, 2012 8:26 AM IST

ఫిలిం నగర్లో ఉన్న జూనియర్ ఎన్టీయార్ ఆఫీస్ పై కొంత మంది గుర్తు తెలియని దుండగులు దాడి చేసారు. అర్ధ రాత్రి దాటాక ఒంటి గంట ప్రాంతంలో రాళ్లతో, కర్రలతో అక్కడే ఆఫీస్ ముందు ఆపి ఉన్న వాహనాల అద్దాలు పగల కొట్టారు. లోపల ఉన్న సిబ్బంది తేరుకుని వచ్చే సమయానికి దుండగులు పారిపోయినట్లు సమాచారం. అయితే వారు ఏ కక్షతో దాడి చేసింది అనేది ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటన ఫిలిం నగర్లో అలజడి సృష్టించింది. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఇది జరిగి ఉండొచ్చు అని పలువురు అంచనా వేస్తున్నారు.

తాజా వార్తలు