మురుగన్ పాత్రలోకి ఎన్టీఆర్.. ఇప్పటి నుంచే మొదలు!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఎలాంటి నటుడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పాత్ర ఎలాంటిది అయినా ఏ జానర్ నుంచి అయినా కూడా అవలీలగా నటించగల సత్తా ఎన్టీఆర్ కి సొంతం. అయితే తారక్ కి పౌరాణిక పాత్రలకి మంచి అనుబంధం ఉంది. ఇపుడు అంటే ఇవి కొంచెం వెనక్కి వెళ్లాయి కానీ ఆ మధ్య జై లవకుశ, యమదొంగ, రామయ్య వస్తావయ్యా లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ అదరగొట్టాడు.

మరి ఇలాంటి రోల్ లో ఒక ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా తనపై అంటే దానిపై అంచనాలు వేరే లెవల్లో ఉంటాయి. ఇలాంటి భారీ ప్రాజెక్ట్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సిద్ధం చేయగా ఈ సినిమా కుమారస్వామి నేపథ్యంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే కుమారస్వామి కోసం ఇపుడు ఎన్టీఆర్ చదవడం మొదలు పెట్టాడు. తన చేతిలో ముగుగన్ పుస్తకం కనిపించడంతో ఎన్టీఆర్ ఇప్పుడు నుంచే ఈ ప్రాజెక్ట్ కోసం కసరత్తులు చేసి తనని తాను కొత్తగా మలుచుకునే యత్నం ఇప్పుడు నుంచే చేయడం అనేది తన డెడికేషన్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Exit mobile version