ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రాబోతున్న ‘జాకీ’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో రాబోతున్న ‘జాకీ’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్

Published on Sep 26, 2025 5:30 PM IST

Jockey

పీకే7 స్టూడియోస్ సమర్పణలో డా.ప్రగభల్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘జాకీ’. ‘మడ్డీ’ ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు మరింత వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై మంచి ఆసక్తిని రేకెత్తించింది.

మధురైలో సాంప్రదాయంగా జరిగే గోట్ ఫైట్ (మేకల పోరు) చుట్టూ ఈ కథ నడవబోతోంది. అయితే కేవలం పోరాటాలకే పరిమితం కాకుండా, భావోద్వేగాలతో కూడిన కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీమ్ చెబుతోంది.

2022 నుంచే ఆ ప్రాంతంలో ఉండి సంస్కృతి, సంప్రదాయాలను లోతుగా స్టడీ చేసిన డైరెక్టర్ ప్రగభల్, స్థానికులతో మమేకమై సహజసిద్ధంగా ఈ సినిమా తెరకెక్కించారు. నటీనటులు కూడా గోట్ కీపర్స్‌తో రోజులు గడిపి, వారితో అనుబంధం పెంచుకుని పాత్రల్లో మునిగిపోయారని చిత్ర యూనిట్ చెబుతోంది.

ఇక నటీనటుల అద్భుత ప్రదర్శన, నిజజీవితాన్ని తలపించే ఫైట్ సన్నివేశాలు, భావోద్వేగాలు కలగలిపి జాకీ చిత్రం ప్రేక్షకలకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాను ప్రేమ కృష్ణదాస్, సీ.దేవదాస్ ప్రొడ్యూస్ చేస్తుండగా శక్తి బాలాజీ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు