ప్రారంభమైన జండాపై కపిరాజు కొత్త షెడ్యూల్

nani_janda_pai_kapiraju

నాని కొత్త చిత్రం ‘జండాపై కపిరాజు’ కొత్త షెడ్యూల్ ఈ మధ్యే హైదరాబాద్లో మొదలైంది. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ చెన్నైలో ముగించుకుని ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. మరో మూడు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్లో నాని మీద కొన్ని ముఖ్య సన్నివేశాలు తీస్తారు. సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాసన్ నిర్మాత. ఇప్పటివరకూ 50 శాతం చిత్రీకరణ ముగించుకున్న ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

అమలా పాల్ ఈ సినిమాలో హీరొయిన్ గా కనిపించనుంది. జి. వి. ప్రకాష్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదల కావచ్చు. ఇదిలా ఉండగా కృష్ణవంశీ దర్శకత్వంలో నాని నటించిన ‘పైసా’ ఏప్రిల్లో విడుదలకు సిద్దమవుతుంది.

Exit mobile version