ఆగస్ట్ 1న మొదలు కానున్న జెండా పై కపిరాజు


నాని, అమలా పాల్ ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “జెండా పై కపిరాజు” ఆగస్ట్ 1న అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలుకానుంది. పరిశ్రమ నుండి పలువురు పెద్దలు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. “శంభో శివ శంభో” చిత్ర దర్శకుడు సముద్రఖని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కే ఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా తెలుగు మరియు తమిళంలో తెరకెక్కనుంది. మనం మారితే ప్రపంచం మారుతుంది అన్న అంశం మీద ఈ చిత్రం ఉండబోతుందని సమాచారం. జి వి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. నాని మరియు అమలా పాల్ కలిసి పని చెయ్యడం ఇదే మొదటిసారి.

Exit mobile version