జీవితా రాజశేఖర్ కు కుటుంబానికి కరోనా..వివరాలు ఇవే!

జీవితా రాజశేఖర్ కు కుటుంబానికి కరోనా..వివరాలు ఇవే!

Published on Oct 17, 2020 2:17 PM IST

మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశ వ్యాప్తంగా కరోనా వల్ల ఎలాంటి నష్టం జరిగిందో తెలిసిందే. ముఖ్యంగా సినీ పరిశ్రమలో కూడా తీరని నష్టాలు జరిగాయి. అలా టాలీవుడ్ కు చెందిన ఎందరో సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికీ పలు కేసులు అలా నమోదు అవుతున్నారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ కు మరియు అతని భార్య జీవితకు కరోనా వచ్చిందని పలు వార్తలు బయటకు వచ్చాయి.

దీనితో వీటిపై క్లారిటీ ఇస్తూ రాజశేఖర్ ట్వీట్ చేసారు. వారికి కరోనా వచ్చిందని వచ్చిన వార్తలు నిజమే అని తనకి తన భార్యకు మరియు అలాగే తన ఇద్దరు పిల్లలు శివాత్మిక మరియు శివానీలకు కూడా కరోనా వచ్చినట్టుగా తెలిపారు. అలాగే వారు దాని నుంచి బయటపడ్డారని కూడా తెలిపారు. కానీ తాను మరియు జీవితలు కాస్త బెటర్ గా ఫీలవుతున్నామని తెలిపారు. ప్రస్తుతానికి అయితే హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారట.

తాజా వార్తలు