ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి కథ, కథనం, దర్శకత్వం అందిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్లు, టీజర్, పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ మూవీ నుంచి తాజాగా మరో మెలోడీ సాంగ్ విడుదలైంది.
విలక్షణ నటుడు జేడీ చక్రవర్తి ‘ఓ.. చెలియా’ నుంచి ‘నాకోసం ఆ వెన్నెల’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. ఎంఎం కుమార్ అందించిన హాయిగొలిపే సంగీతం, శివ సాహిత్యం, మేఘన, మనోజ్ గాత్రం శ్రోతలను కట్టిపడేస్తున్నాయి. హీరో, హీరోయిన్ల మధ్య అందమైన ప్రేమను ఈ పాట చాటుతోంది.
పాట విడుదల అనంతరం జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. పాట చాలా బాగుందని, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. సురేష్ బాలా కెమెరా వర్క్, ఉపేంద్ర ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.


