కాస్త విరామం తరువాత జె.డి చక్రవర్తి మరోసారి రంగంలోకి దిగాడు. ఈసారి కేవలం నటనమీదే దృష్టి పెట్టనున్నాడు. సమీర్ దర్శకుడు. ఈ సినిమాలో జె.డి చక్రవర్తి, అర్జున్ నటిస్తున్నారు. సమీర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రంజిత్ గోగినేని నిర్మిస్తున్నారు
ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ “ఇది ఒక ట్రయాంగ్యులర్ స్టొరీ. అడగిన వెంటనే డేట్స్ ను ఇచ్చినందుకు జె.డి చక్రవర్తికి అర్జున్ కి కృతజ్ఞతలు. వారికి చాలెంజింగ్ పాత్రలురాసుకున్నాను . సుహాస్ – విశ్వాస్ సంగీత దర్శకులు. రీ రికార్డింగ్ పూర్తయింది” అని తెలిపారు
ఈ సినిమా మూడవ షెడ్యూల్ ఫిబ్రవరి 1నుండి మొదలుకానుంది. ఈ సినిమాను హైదరాబాద్, కొల్హాపూర్ ప్రాంతాలలో 25రోజులు చిత్రీకరిస్తే సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వేసవిలో విడుదలకు సిద్ధంచేస్తున్నారు