సహజ నటి జయసుధ ఎవడు మూవీ సక్సెస్ విషయంలో పలు విధాలుగా షాక్ అయ్యింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ మూవీలో చరణ్ తల్లి పాత్రలో జయసుధ కనిపించింది. అలాగే ఆమె నటనకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆమె తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘ నేనెప్పుడూ అలాంటి పవర్ఫుల్ పాత్ర చేయలేదు. సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని అనుకున్నాను. నా పెర్ఫార్మన్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి చాలా ఆనందం వేసింది. నా పాత్రకి నేనో అవార్డు కుడా ఆశిస్తున్నానని’ ఆమె తెలిపింది. గత కొద్ది సంవత్సరాలుగా జయసుధ పలు పెద్ద సినిమాల్లో ఎన్నో మంచి పాత్రల్లో నటిస్తున్నారు.
అలాగే విలన్ పాత్ర పోషించిన సాయి కుమార్ నటనకి కూడా మంచి ఆదరణ లభించింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీని దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీలో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రల్లో కనిపించారు.