విలక్షణ నటుడు జగపతి బాబు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ ఫ్యామిలీ హీరో ఈ సినిమాలో స్టైలిష్ విలన్ గా కనువిందు చేయనున్నాడు. జగపతి బాబు ఈ నెల 21 నుంచి బాలకృష్ణ టీంతో కలిసి షూటింగ్లో పాల్గొననున్నాడు.
జగపతిబాబు ప్రస్తుతం గడ్డం పెంచుతూ తన పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నాడు. కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడినప్పుడు ‘ ఈ సినిమా కోసం నా బాడీ లాంగ్వేజ్, పాత్రకి తగ్గట్టు నా స్టైల్ ని మార్చుకుంటున్నానని’ జగపతి బాబు తెలిపాడు.
బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాని వారాహి చలన చిత్ర సమర్పణలో 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఓ హీరోయిన్ కోసం సోనాల్ చౌహాన్ ని ఎంపిక చేయగా మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. త్వరలోనే ఆమెని ఫైనలైజ్ చేసి తెలియజేసే అవకాశం ఉంది.