‘లెజెండ్’లో నాది ‘డీ అంటే డీ’ అనే పాత్ర – జగపతి బాబు

Jagapathi-Babu-in-Legend

25 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగి ఎంతో మంది ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో జగపతి బాబు. హీరోగానే కాకుండా అన్నయ్య, ఫ్రెండ్ పాత్రలు కూడా చేస్తున్న జగపతి బాబు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘లెజెండ్’ సినిమాతో విలన్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇటీవలే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగపతి బాబు తన పాత్ర గురించి చెబుతూ ‘ లెజెండ్ లో ఫుల్ లెంగ్త్ విలన్ పాత్ర. అలా అని ఆ పాత్ర మోటుగా రేపులు, స్మగ్లింగ్, ల్యాండ్ మాఫియాలా కాకుండా స్టైలిష్ గా ఉంటుంది. బాగా పంతం ఉన్న వ్యక్తి. నువ్వొక దెబ్బ కొడితే నేనొక దెబ్బ కొడతా అనే టైపు పాత్ర. చెప్పాలంటే ‘డీ అంటే డీ’ అనే పాత్రని’ తెలియజేశాడు.

బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మార్చి చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ని వారాహి చలన చిత్రం – 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు కలిసి నిర్మిస్తున్నారు.

Exit mobile version