బహుబలి తరువాత భారీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు హీరో ప్రభాస్. ఆయన గత చిత్రం 350 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కి 420 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. ఇక ఆయన లేటెస్ట్ మూవీ దర్శకుడు రాధా కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఇటీవలే ఈ చిత్ర తాజా షెడ్యూల్ మొదలుకాగా ప్రత్యేకంగా వేసిన భారీ సెట్స్ నందు చిత్రీకరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ రోల్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. పీరియాడిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతి బాబు ఓ విభిన్నమైన విలన్ రోల్ చేస్తున్నారట. ఆయన పాత్ర ఈ చిత్రంలో ప్రత్యేకంగా నిలవనుంది సమాచారం.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.1960 ల నాటి పీరియాడిక్ లవ్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. సినిమా ప్రధాన భాగం యూరప్ నేపథ్యంలో నడుస్తుంది.