‘లెజెండ్’ సినిమాతో కొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జగపతిబాబు ఆ సినిమాలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసి అందరినీ మెప్పించాడు. ఈ సినిమా తర్వాత జగపతి బాబుకి వరుసగా ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. విడుదలైన లెజెండ్ కాకుండా సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం’, సందీప్ కిషన్ హీరోగా చేస్తున్న ‘రారా కకృష్ణయ్య’ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.
మాకు అందిన తాజా సమాచారం ఎనర్జిటిక్ హీరో రామ్ నటించనున్న ‘పండగ చేస్కో’ సినిమా కోసం జగపతి బాబుని విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నారు. తన పాత్ర గురించి విన్న జగపతి బాబు కూడా ఈ సినిమా చేయడానికి సముఖత చూపుతున్నట్లు సమాచారం. కానీ ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ అందించనున్నాడు. అలాగే పరుచూరి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మూడవ సారి హన్సిక రామ్ సరసన జోడీ కట్టనుంది.