జడేజా వైల్డ్ ఫైర్.. చెన్నై సూపర్ కింగ్స్ మాస్ వీడియో వైరల్

పాన్ ఇండియా లెవెల్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన కొన్ని ఐకానిక్ సినిమా పాత్రల్లో మాస్ పాత్ర పుష్ప రాజ్ కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ పాత్ర పాన్ ఇండియా లెవెల్లో భారీ రీచ్ ని సొంతం చేసుకుంది. అయితే పార్ట్ 1 నుంచే నేషనల్ లెవెల్లో హవా చూపించిన పుష్ప రాజ్ ప్రభావం క్రికెటర్స్ లో కూడా ఉంది.

అయితే వారిలో ప్రముఖ ఇండియన్ క్రికెటర్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ దళపతి రవీంద్ర జడేజా కూడా పుష్ప మ్యానరిజంలు చేసి వైరల్ గా మారాడు. ఇక రీసెంట్ గానే ఐసీసీ కప్ నెగ్గిన తర్వాత ఐపీఎల్ కి సిద్ధం అవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ పుష్ప 2 తో జడేజాపై వైల్డ్ ఫైర్ వీడియో అంటూ రిలీజ్ చేశారు. మరి ఇందులో జడేజా ఐకాన్ స్టార్ లానే ఇది నా బ్రాండ్ అంటూ చేసిన మ్యానరిజంలు సోషల్ మీడియాలో ఇపుడు మంచి వైరల్ గా మారాయి. దీనితో పుష్ప 2 మ్యానియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version