పూర్తయిన “జబరస్త్”

Siddharth_Samantha-film
సిద్దార్థ్,సమంత మరియు నిత్య మీనన్ ప్రధాన పాత్రలలో రానున్న “జబరస్త్” చిత్రం ప్రధాన భాగ చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుంది. ఈ మధ్యనే ఈ చిత్రం మలేసియాలో ఒక పాట చిత్రీకరణ జరుపుకుంది. ఆసక్తికరంగా ఈ పాటను నిత్య మీనన్ పాడారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మించారు. నందిని రెడ్డి ఈ చిత్ర చిత్రీకరణ అయిపోయిందని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో సమంత మొదటిసారిగా ముస్లిం యువతి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్ర ఆడియో ఈ నెలాఖరిలొ విడుదల కానుంది ఆ తరువాత కొద్ది రోజులకి చిత్రం విడుదల అవుతుంది.

Exit mobile version