రాధే శ్యామ్ అప్డేట్ ఎవరూ ఊహించని విధంగా విడుదల చేసి ఫాన్స్ మరియు సినీప్రేమికులను సర్ప్రైజ్ చేసిన ప్రభాస్ మరో షాకింగ్ అప్డేట్ సిద్ధం చేశాడు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా..గత రాత్రి ప్రభాస్ 21 నిర్మాతలు నేడు ఈ మూవీ నుండి అప్డేట్ ఇస్తున్నట్లు ప్రకటించారు. దీనితో ఫ్యాన్స్ ప్రభాస్ 21 మూవీ నుండి రాబోయే ఆ అప్డేట్ ఏమై ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ప్రభాస్ 21లో హీరోయిన్ గా దీపికా పదుకొనె ను తీసుకుంటున్నట్లు నిర్మాతలు తెలియజేశారు. ఈ విషయంపై ఎప్పటి నుండో వార్తలు వస్తుండగా నేడు అధికారిక ప్రకటన రావడం జరిగింది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మిస్తుండగా..ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. 2022 లో ఈ మూవీ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు గతంలో వెల్లడించడం జరిగింది.
As promised, here it is – our next big announcement! WELCOMING THE SUPERSTAR ♥️https://t.co/QqWERCVywC#Prabhas @deepikapadukone @nagashwin7 @vyjayanthifilms #Prabhas21 #DeepikaPrabhas
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2020