పవన్ డైరెక్టర్ కి బన్నీ హ్యాండిచ్చినట్లేగా..?

పవన్ డైరెక్టర్ కి బన్నీ హ్యాండిచ్చినట్లేగా..?

Published on Jul 31, 2020 7:17 PM IST


కొద్దిరోజులుగా బన్నీ తన తదుపరి చిత్రం కొరటాల శివతో చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ మూవీకి కారణజన్ముడు అనే టైటిల్ కూడా అనుకుంటున్నట్లు ప్రచారం జరిగింది. కాగా నేడు దీనిపై అధికారిక ప్రకటన రావడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. కొరటాల హిట్ ట్రాక్ గురించి తెలిసిన వాళ్లు బన్నీ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ వచ్చి చేరినట్లే అంటున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుండగా, 2022 ప్రారంభంలో విడుదల చేస్తాం అని చెప్పడం జరిగింది. ఐతే కొరటాల దర్శకత్వంలో మూవీ ప్రకటించిన బన్నీ, పవన్ తో వకీల్ సాబ్ చేస్తున్న వేణు శ్రీరామ్ కి హ్యాండిచ్చినట్లు అయ్యింది.

పవన్ అల వైకుంఠపురంలో మూవీకి ముందే వేణు శ్రీరామ్ తో ఐకాన్ మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఐతే ఆ మూవీ పక్కన పెట్టి త్రివిక్రమ్ తో చేశారు. అల వైకుంఠపురంలో మూవీ తరువాత అయినా ఐకాన్ మూవీ చేస్తాడు అనుకుంటే, సుకుమార్ తో పుష్ప మూవీ మొదలుపెట్టాడు. పుష్ప తరువాత కొరటాల శివతో మూవీ ప్రకటించడంతో ఇక వేణు శ్రీరామ్ తో మూవీ చేసే ఆలోచన బన్నీకి లేదని అర్థం అయ్యింది. దిల్ రాజు నిర్మాతగా ఐకాన్ తెరకెక్కాల్సివుండగా ఇక ఈ ప్రాజెక్ట్ కష్టమే అన్న వాదన వినిపిస్తుంది.

తాజా వార్తలు