సంక్రాంతి నిర్మాతలకి షాక్ ఇచ్చిన ఐటీ శాఖ

dil-raju-and-dvv-danyaa

సంక్రాంతి పండుగకి విడుదలైన/అవుతున్న సినిమాల నిర్మాతలకి ఐటీ శాఖ షాక్ ఇచ్చింది. నిన్న విడుదలైన నాయక్ చిత్ర నిర్మాత డివివి దానయ్య, రేపు విడుదలవుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్ర నిర్మాత దిల్ రాజు మీద ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. మాములుగా సినిమా విడుదలయ్యే సమయం కావడంతో నిర్మాతల ఆఫీసుల్లో డబ్బులతో హడావిడిగా ఉంటాయి. అదును చూసి ఐటీ వారు దాడులు నిర్వహించారు. ఈ దాడుల వల్ల సినిమా విడుదల పైన ఎఫెక్ట్ ఉండదు. ఈ రెండు సినిమాల బిజినెస్ దాదాపు 90 కోట్ల పైనే ఉండటం, డిస్ట్రిబ్యూటర్ల నుండి డబ్బు వస్తుందని ఆశించి ఐటీ వారు దాడి చేసినట్లుగా తెలుస్తోంది.

Exit mobile version