పూరికి ఆ మూవీ ఊపిరి పోసిందట.


ఎంతటి స్టార్ డైరెక్టర్ అయినా ఒక్క ప్లాప్ పడితే అంతే సంగతులు. ఇక వరుస ప్లాప్స్ అయితే దుకాణం సర్దుకోవలసిందే. దర్శకుడు పూరి జగన్నాధ్ కి సైతం గత ఏడాది విడుదలైన ఇస్మార్ట్ శంకర్ మూవీ పెద్ద బ్రేక్ ఇచ్చింది. దర్శకుడిగా, నిర్మాతగా ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ తో ఫార్మ్ లోకి వచ్చాడు. ఇదే విషయాన్ని పూరి స్వయంగా ఒప్పుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ మూవీ విజయం తనకు మరలా ఊపిరి పోసిందని ఆయన సోషల్ మీడియాలో తెలియజేశారు.

రామ్ హీరోగా విడుదలైన ఆ మూవీ 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. కాగా పూరి ప్రస్తుతం హీరో విజయ్ దేవరకొండతో ఓ మూవీ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ ఫైటర్ గా నటిస్తుండగా…అనన్య పాండే అతనికి జంటగా నటిస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version