బాలయ్యతో రొమాన్స్ చేయనున్న ఇషా చావ్లా-పార్వతి మెల్టన్

బాలయ్యతో రొమాన్స్ చేయనున్న ఇషా చావ్లా-పార్వతి మెల్టన్

Published on Feb 6, 2012 3:29 PM IST


ఇషా చావ్లా మరియు పార్వతి మెల్టన్ కలిసి ‘కల్కి’ చిత్రంలో బాలయ్యతో రొమాన్స్ చేయనున్నారు. ఇషా చావ్లా కి అగ్ర హీరోతో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ప్రస్తుతం ఆమె సునీల్ సరసన ‘పూలరంగడు’ చిత్రంలో నటిస్తుంది. మొదట్లో పార్వతి మెల్టన్ పేరు ఒక్కటే వినిపించింది. ఈ చిత్ర ఓపెనింగ్ ఈ రోజు అన్నపూర్ణ స్టుడియోలో జరిగింది. బాలకృష్ణ, ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ దర్శకుడు రవి చావాలి, నిర్మాత రమేష్ పుప్పాల ఈ వేడుకకు విచ్చేసారు. వీరు కాకుండా దాసరి నారాయణరావు, కృష్ణంరాజు, తమ్మారెడ్డి భరద్వాజ, బెల్లంకొండ సురేష్, మంచు మనోజ్ కుమార్, వీరభద్రం చౌదరి, ఎస్వీ కృష్ణ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. బాలయ్య కొత్త లుక్ తో ఈ వేడుకలో పాల్గొన్నారు.

తాజా వార్తలు