‘పెద్ది’ కోసం వైరల్ గర్ల్ ఫిక్సేనా?

Peddi-sreeleela

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కలయికలో తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. సాలిడ్ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ని మేకర్స్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇలా సినిమాలో ఓ స్పెషల్ ఫోక్ సాంగ్ ని ప్లాన్ చేస్తుండగా ఈ సాంగ్ కోసం యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ శ్రీలీల ఫిక్స్ అయ్యినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అయితే ఇది వరకే శ్రీలీల ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందని బజ్ వచ్చింది. కానీ ఇపుడు ఈ ఫోక్ సాంగ్ కోసం దాదాపు ఖరారే అన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. రీసెంట్ గానే జూనియర్ సినిమాలో వైరల్ సాంగ్ తో శ్రీలీల ఎలా షేక్ చేసిందో తెలిసిందే. మరి పెద్దిలో ఉందో లేదో అనేది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది మార్చ్ 27న సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతుంది.

Exit mobile version