“వకీల్ సాబ్” వచ్చేది అప్పుడేనా?

“వకీల్ సాబ్” వచ్చేది అప్పుడేనా?

Published on Jun 12, 2020 2:01 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ పింక్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పరిస్థితులు బాగుండి ఉంటే ఈపాటికే ఈ చిత్రం విడుదల అయ్యి ఉండేది. ఇప్పటికే 80 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కాస్త లేట్ గానే మళ్ళీ షురూ కానుంది.

ఇదిలా ఉండగా మరోపక్క అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం దసరా రేస్ లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు చేసిన షూటింగ్ నే శ్రీరామ్ వేణు శరవేగంగా చిత్రీకరించారు.

సో మిగతా పార్ట్ ను కూడా త్వరగా ఫినిష్ చేసే అవకాశం ఎలాగో ఉంది. మరి దసరా రేస్ లో ఈ చిత్రం నిలుస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా మొట్ట మొదటి సారి పవన్ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు