“వకీల్ సాబ్” టీం ఇంకేమన్నా ప్లాన్ చేసారా?

“వకీల్ సాబ్” టీం ఇంకేమన్నా ప్లాన్ చేసారా?

Published on Aug 29, 2020 1:20 PM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్” కేవలం వర్కింగ్ స్టిల్ తోనే ఆ టైం లో సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ తర్వాత ఫస్ట్ లుక్ పోస్టర్ తో కూడా రచ్చ లేపారు. అయితే పవన్ అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న తరుణం ఇపుడు రానే వచ్చింది. వచ్చే సెప్టెంబర్ 2 న పవన్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ ఆల్రెడీ ఓ సర్ప్రైజ్ ను ప్లాన్ చేసేసారు. కానీ వారు ప్లాన్ చేసింది ఏమిటా అన్నది ఇంకా తెలియరాలేదు.

మహా అయితే వస్తే టీజర్ కానీ, లేదా మోషన్ పోస్టర్ కానీ వస్తుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఎక్కువగా మోషన్ పోస్టర్ మాత్రమే వస్తుందని వార్తలు సర్క్యులేట్ అవుతున్న వకీల్ సాబ్ యూనిట్ అంతకు మించి స్పెషల్ గా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. ఎలాగో సంగీత దర్శకుడు థమనే ముందు హింట్ ఇచ్చాడు కాబట్టి థమన్ వైపు నుంచే ఏమన్నా ప్లాన్ చేసి ఉండొచ్చు. అసలు ఈ పుట్టినరోజుకు పవన్ అభిమానులు తారలా స్థాయి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఏం జరగనుందో చూడాలి.

తాజా వార్తలు