అసలు ఎప్పుడూ ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస పెట్టి ఇన్ని చిత్రాలను అంగీకరించడం అలాగే ఏకకాలంలో పలు చిత్రాలు షూటింగ్స్ లో పాల్గొనడం జరగలేదు. కానీ అవన్నీ గత ఏడాది నుంచే పవన్ మొదలు పెట్టేసాడు. ఇక ఇదిలా ఉండగా ఈ ఏడాది మాత్రం మరిన్ని ప్రాజెక్టులకు పవన్ సైన్ చేసి మరింత ఆశ్చర్యపరిచారు. మరి వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్న మాట పక్కన పెడితే తాను చేయనున్న క్రేజీ ప్రాజెక్టులలో బండ్ల గణేష్ కు ఓకే చెప్పిన ప్రాజెక్ట్ ఒకటి.
“గబ్బర్ సింగ్” లాంటి భారీ హిట్ తర్వాత బండ్లకు పవన్ ఓకే చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఈ సినిమాపై అప్పుడే పలు రూమర్లు మొదలయ్యిపోయాయి. ఇంకా దర్శకుడు కూడా ఓకే కాని ఈచిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ ఇందులో ఎలాంటి నిజమూ లేనట్టు తెలుస్తుంది.
ప్రస్తుతానికి బండ్ల అయితే పవన్ తో సినిమాకు ఒప్పించారు. కానీ దర్శకుని విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారట. దీనితో ప్రస్తుతానికి పవన్ దర్శకుని విషయంలో అవన్నీ రూమర్సే అన్నట్టు తెలుస్తుంది. మరి బండ్ల గణేష్ ఏ దర్శకునితో ప్లాన్ చేసారో అన్నది తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.